బీఆర్ఎస్ నేత‌ల‌ గృహనిర్బంధం

తెలంగాణాలో బీఆర్ఎస్ నేతల అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్ బండ్) లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.

By Kalasani Durgapraveen  Published on  6 Dec 2024 12:00 PM IST
బీఆర్ఎస్ నేత‌ల‌ గృహనిర్బంధం

తెలంగాణాలో బీఆర్ఎస్ నేతల అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్ బండ్) లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారి నివాసాల నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే పద్మారావులను, నాయకులను గృహనిర్బంధం చేశారు.

Next Story