మంత్రిగా ఆయన ఫెయిల్ అయ్యారు : పుట్టా మధు
మంత్రి శ్రీధర్ బాబు కుటుంబం నుంచి నలభై ఏళ్లకు పైగా మంథని నియోజవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 8:02 AM GMTమంత్రి శ్రీధర్ బాబు కుటుంబం నుంచి నలభై ఏళ్లకు పైగా మంథని నియోజవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు.. మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నియోజకవర్గానికి చేసిందేమి లేదు.. ఏడాదిలో స్థానిక ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యారని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పటికీ శ్రీధర్ బాబు తన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పదేపదే శ్రీధర్ బాబు పేరు తీసుకుంటారు.. కానీ ఏడాదిలో మంథనికి కొత్తగా చేసిందేమి లేదు.. శ్రీధర్ బాబు ఏడాది వైఫల్యాలపై చార్జీషీట్ విడుదల చేస్తున్నామన్నారు.
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తట్టెడు మన్ను తీయలేదు.. స్థానికంగా పరిశ్రమలు పెడతా అన్నాడు.. నిరుద్యోగులకు ఉపాధి అన్నారు.. ఇప్పటికి వరకూ ఆ ఊసే లేదు.. మంథనిని ప్రధాన నగరాలతో కలిపే రోడ్ల నిర్మాణంపై శ్రీధర్ బాబు శ్రద్ద వహించడం లేదన్నారు. ఇసుక దందా జరుగుతోందని ఎన్నికల సందర్భంగా ఆరోపించిన శ్రీధర్ బాబు ఇసుక రీచ్ లు పెంచారు.. పెద్ద పల్లి ఎమ్మెల్యే ప్రజలకూ ఉచితంగా ఇసుక అందిస్తున్నారు.. శ్రీధర్ బాబు దాన్ని పట్టించుకోవడం లేదు.. మంథని లో అన్ని మాఫియాలు చెలరేగుతున్నాయన్నారు.
విద్యా సౌకర్యాలు మెరుగు పరిచేందుకు శ్రీధర్ బాబు కనీసం ఒక్క రివ్యూ కూడా చేయలేదు.. మెడికల్ కాలేజీ తెస్తానని తేవడం లేదన్నారు. ఓడేరు దగ్గర బ్రిడ్జి నిర్మాణంపై శ్రీధర్ బాబు స్పందన శూన్యం అన్నారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులను ప్రతిపక్షంలో ఉన్నపుడు రెచ్చగొట్టిన శ్రీధర్ బాబు ఇపుడు వారికోసం చేసిందేమి లేదన్నారు. శ్రీధర్ బాబు మంథనిలో పోలీస్ స్టేషన్లను కాంగ్రెస్ కార్యాలయాలుగా మార్చారు.. సాధారణ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తల ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవడం లేదు.. ఓటు బ్యాంకు రాజకీయాలకే శ్రీధర్ బాబు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. మంథని కేసీఆర్ హాయంలోనే అభివృద్ధి చెందిందన్నారు.. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబుకు ఎన్నో అవకాశాలున్నా.. మంథనిని పట్టించుకోవడం లేదు.. ఈ చార్జి షీట్ తోనైనా శ్రీధర్ బాబు కళ్ళు తెరిచి మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు.