అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని నాకు ముందే తెలుసు: ఎర్రబెల్లి దయాకర్‌రావు
తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగిలింది.
By Srikanth Gundamalla Published on 11 May 2024 3:42 PM ISTఅసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని నాకు ముందే తెలుసు: ఎర్రబెల్లి దయాకర్‌రావు
తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. మెజార్టీ సీట్లు రాకపోవడంతో అధికారాన్ని కోల్పోయింది. మంత్రులుగా ఉన్నవారు కూడా ఎన్నికల్లో ఓడిపోవడం షాక్‌కు గురి చేసింది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ముఖ్యనేతల్లో ఒకరు ఎర్రబెల్లి దయాకర్‌రావు. తాజాగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతానని తనకు ముందే తెలుసు అని అన్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తాను విజ్ఞప్తి చేశానన్నారు. సీటు మార్చాలనీ.. అలా అయితే తాను కచ్చితంగా గెలుస్తానని ముందే చెప్పానని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.
కాగా.. ఎర్రబెల్లి దయాకర్‌రావు 1994, 1999, 2004లో వర్దన్నపేట నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009, 2014, 2019లో పాలకుర్తి నుంచి పోటీ చేసి గెలుపొందారు. దాదాపు మూడు దశాబ్దాలుఆ ఓటమి ఎరుగని నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు.. గత 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. కాగా.. ఆయన పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.
శనివారం వరంగల్‌లో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ గత ఎన్నికల్లో తన ఓటమి గురించి ప్రస్తావించారు. మూడు నెలల ముందే తన సీటు మార్చాలని పార్టీ చీఫ్‌ను కోరినట్లు తెలిపారు. తన ఓటమి గురించే కాదు.. బీఆర్ఎస్ 40 సీట్లలో మాత్రమే గెలుస్తుందనీ.. తనతో పాటుగా 20 స్థానాలను మార్చాలని కోరినట్లు వివరించారు. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే బీఆర్ఎస్ అధినేతకు ఈ విజ్ఞప్తిని చేసినట్లు చెప్పారు ఎర్రబెల్లి దయాకర్‌రావు.
కాగా.. తాజాగా వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. ఆయన్ని ప్రజలు గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇబ్బందులు అప్పుడే మొదలయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్‌తోనే ప్రజలకు న్యాయం అందుతుందని చెప్పారు. వరంగల్‌లో సుదీర్ కుమార్ 40 వేల మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. ఇక్కడ రెండోస్థానం కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడతాయని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.