ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 18 March 2024 1:43 PM ISTఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే.. దానం నాగేందర్‌పై అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరినందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఇక తమ ఫిర్యాదుపై స్పందించిన ఆయన.. యాక్షన్ తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలంటూ రేవంత్‌రెడ్డి గతంలో కామెంట్స్ చేశారని గుర్తు చేశారు పాడి కౌశిక్‌రెడ్డి. అలాంటి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు తమ పార్టీలోని ఎమ్మెల్యేలను ఎలా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. అలాగే బీఆర్ఎస్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష బృందం pic.twitter.com/4b1dAhrqTD
— Newsmeter Telugu (@NewsmeterTelugu) March 18, 2024