ఇవాళ కోనాయిపల్లికి సీఎం కేసీఆర్..ఆ ఆలయం పార్టీకి సెంటిమెంట్
సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లికి వెళ్లనున్నారు.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 2:27 AM GMTఇవాళ కోనాయిపల్లికి సీఎం కేసీఆర్..ఆ ఆలయం పార్టీకి సెంటిమెంట్
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ నేత సీఎం కేసీఆర్ కూడా వరుస బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లికి వెళ్లనున్నారు. అక్కడ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకుంటారు కేసీఆర్. ప్రత్యేక పూజలు చేస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సూచనలతో స్థానిక నాయకులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు.
కోనాయిపల్లి వేంకటేశ్వరాయలయం సీఎం కేసీఆర్, పార్టీకి సెంటిమెంట్‌గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు.. ఇతర పార్టీ నేతలు కూడా ఇక్కడ వెంకన్న దర్శనం చేసుకుంటారు. నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయిస్తారు. అయితే.. ఈ దేవాలయ ముఖద్వారం దక్షణం వైపు ఉంటుంది. ఇలా దక్షిణం వైపు ఉన్న దేవాలయాలు చాలా అరుదు. అది కూడా ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.
కాగా.. సీఎం కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను కోనాయిపల్లి వేంకటేశ్వ స్వామివారి సన్నిధిలో పెట్టి పూజలు చేస్తారు. ఈ నెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదేరోజు బీఆర్‌ఎస్ ఆశీర్వాదసభల్లో పాల్గొననున్నారు. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు.