వరద సహాయం నిలిపివేతపై ప్రజల ఆగ్రహం.. సీఎం కేసీఆర్ ఏంమ‌న్నారంటే..?

Break for flood relief .. జీహెచ్‌ఎంసీ పరిధిలో వరదసాయానికి బ్రేక్‌ పడింది. గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల

By సుభాష్  Published on  18 Nov 2020 1:12 PM GMT
వరద సహాయం నిలిపివేతపై ప్రజల ఆగ్రహం.. సీఎం కేసీఆర్ ఏంమ‌న్నారంటే..?

జీహెచ్‌ఎంసీ పరిధిలో వరదసాయానికి బ్రేక్‌ పడింది. గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. దీంతో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని వెంటనే నిలిపివేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ వరద సహాయం నిలిపివేతపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో నిల్చున్నాము. రేపటి కోసం టోకెన్ తీసుకున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల నుంచి పనులన్నీ పక్కన పెట్టి మీసేవ చుట్టూ తిరిగాం.. ఎన్నికల తరువాత డబ్బులు ఇస్తామంటే ఎలా నమ్ముతాం.. ఇప్పుడు ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం అని ప్రజలు అంటున్నారు.

వదర సాయానికి బ్రేక్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీనే వరద సాయాన్ని నిలిపేలా చేసిందని ఆరోపించారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకే ఎన్నికల సంఘం వరద సాయాన్ని నిలిపివేసిందన్నారు. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇక కేంద్రంపై సమరానికి సిద్ధమయ్యారు. డిసెంబర్‌ 2వ వారంలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటానికి రెడీ అయ్యారు. డిసెంబ‌ర్ రెండో వారంలో జాతీయ‌స్థాయి నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ స‌ద‌స్సుకు దేశంలోని ప్ర‌ధాన ప్రాంతీయ పార్టీల‌ను ఆహ్వానిస్తామ‌న్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో నూటికి నూరుశాతం విజ‌యం తెరాస‌దేన‌ని తెలిపారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాని నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

Next Story