బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారానికి సినిమానే ఇన్స్పిరేషనా..?

Bowenpally Kidnap Case. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసుకి బాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ అని అంటున్నారు.

By Medi Samrat  Published on  13 Jan 2021 12:30 PM GMT
Bowenpally Kidnap Case

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసుకి బాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ అని అంటున్నారు. భార్గవ్ సోదరుడు చంద్రహాస్ కిడ్నాప్‌కు ముందు అక్షయ్ కుమార్ నటించిన 'స్పెషల్ 26' అనే సినిమాని మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియకు అలాగే మిగిలిన వారికి చూపించాడట. ఐటి అధికారులుగా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిసింది. యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్‌లో చంద్రహాస్‌, అఖిలప్రియ అండ్‌ గ్యాంగ్‌కి కిడ్నాప్‌కు సంబంధించి శిక్షణ ఇచ్చాడని తెలుస్తోంది. అఖిలప్రియ ఆదేశాలకు అనుగుణంగానే కిడ్నాప్ చేయించినట్లు భార్గవ్, చంద్రహాస్ తెలిపారు. ఐటి అధికారుల చెకింగ్ డ్రెస్సులు, ఐడి కార్లను చంద్రహాస్‌ తయారు చేశాడని విచారణలో తేలింది. శ్రీ నగర్ కాలనీలోని ఒక సినిమా కంపెనీ నుంచి ఐటి అధికారుల డ్రెస్‌లను వీరు అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది. సినిమాల నుండి ఇన్స్పైర్ అవ్వడం అంటే ఇదేనేమో అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.

ఇన్ని రోజులూ తప్పించుకుంది తిరుగుతున్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అతన్ని ప్రస్తుతం ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారని కథనాలు వచ్చాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ కేసులో మొత్తం 19 మందిని నిందితులుగా పోలీసులు తెలిపారు. ఇప్పటివరకూ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా 11 మందిలో భార్గవ్ రామ్ తో పాటు, గుంటూరు శ్రీను తదితరులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిలో భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తుండగా.. మరో 10 మంది ఆచూకీపై పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.


Next Story
Share it