పేలిన నాటుబాంబు.. వ్యక్తికి తీవ్రగాయాలు
Bomb Blasted in Kamareddy District.కామారెడ్డి జిల్లాలో నాటుబాంబు పేలుడు కలకలం రేపింది. బాన్సువాడలో
By తోట వంశీ కుమార్ Published on
30 Aug 2021 7:17 AM GMT

కామారెడ్డి జిల్లాలో నాటుబాంబు పేలుడు కలకలం రేపింది. బాన్సువాడలో నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌లో అడవి పందుల వేట కోసం వేటగాళ్లు నాటుబాంబులు అమర్చారు. అయితే.. సోమవారం అవి ఒక్కసారిగా పేలాయి. ఈ ఘటనలో కుల్దీప్‌సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కుల్దీప్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story