ఎట్టకేలకు ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణ స్వీకారం చేయమని చెప్పిన బీజేపీ నేతలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Dec 2023 3:30 PM IST
BJP MLAs,  oath,  assembly,

ఎట్టకేలకు ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణ స్వీకారం చేయమని చెప్పిన బీజేపీ నేతలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజా సింగ్, తెలంగాణ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన మరో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ప్రమాణం చేశారు. స్పీకర్‌గా ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు సభకు హాజరై ప్రమాణం చేశారు.

ప్రొటెం స్పీకర్‌గా ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఇ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్యే ఒవైసీని నియమించడాన్ని నిరసిస్తూ రాజా సింగ్‌తో పాటు మరో ఏడుగురు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఒవైసీ కంటే సీనియర్‌ సభ్యులు ఉన్నా కూడా నిబంధనలను ఉల్లంఘించి ప్రొటెం స్పీకర్‌గా నియమించారని కాషాయ పార్టీ ఆరోపించింది. అక్బరుద్దీన్ నియామకంపై బీజేపీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల ముసుగులో కొన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టడానికి ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించిందని బీజేపీ ఆరోపించింది.

Next Story