రేషన్‌ బియ్యాన్ని అయోధ్య అక్షింతలంటూ పంచారు: సీఎం రేవంత్‌

బీజేపీ నేతలు రేషన్‌ బియ్యం తీసుకొచ్చి అయోధ్య రాముని అక్షింతలు అంటూ పంచారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

By అంజి  Published on  6 May 2024 2:45 AM GMT
BJP leaders, ration rice, Ayodhya talambras, CM Revanth

రేషన్‌ బియ్యాన్ని అయోధ్య అక్షింతలంటూ పంచారు: సీఎం రేవంత్‌

బీజేపీ నేతలు రేషన్‌ బియ్యం తీసుకొచ్చి అయోధ్య రాముని అక్షింతలు అంటూ పంచారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కాకముందే రేషన్‌ బియ్యానికి పసుపు కలిపి గ్రామాల్లో పంచారని అన్నారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేశారని, దేవుడిని అడ్డం పెట్టుకునని ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని తుక్కుగూడ రోడ్‌ షోలో రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఊరూరా పంచిన అక్షింతలు అయోధ్య నుంచి తెచ్చినవేనని బీజేపీ నేతలు ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి దేవుడి పేరుతో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు.

మనం హిందువులం కాదా అని, మనం మైసమ్మ, పోచమ్మలకు కోడి కోసినం కల్లు పోసినమన్నారు. వీళ్లు వచ్చి మనకు నేర్పాలా? అని మండిపడ్డారు. సూరత్‌ నుంచి వచ్చిన మోదీ, అమిత్‌ షా రాజకీయ పార్టీల మధ్య చిచ్చుపెడుతున్నారని సీఎం ఆరోపించారు. ప్రజల రిజర్వేషన్లను రద్దు చేసి, దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టుపెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు ఓట్ల కోసం తెలంగాణ పేరుతో నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కావని, ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు.

Next Story