సాధారణంగా వాహనాలను రోడ్లపై నడపాలి. అయితే.. ఇక్కడో ఓ యువకుడు వేగంగా బైక్‌ను నడుపుతూ బట్టల షాక్‌లోకి దూసుకెళ్లాడు. ఈ హఠాత్ పరిణామంతో ఆ షాపులోని వారు కాస్త కంగారు పడ్డారు. బైక్ రావడాన్ని గుర్తించి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో అతడికి కూడా ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది.
కమాన్ బజార్‌లోని రావిచెట్టు ప్రాంతంలో ఉన్న ఓ బట్టల షాపులోకి సోమవారం రాత్రి సడెన్‌గా ఓ పల్సర్ బైక్ దూసుకువచ్చింది. ఆ సమయంలో షాపులో ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి ఉన్నారు. బైక్ షాపులోకి వస్తుండగాన్ని గమనించిన వారు పక్కకు తప్పుకున్నారు. షాపులోకి దూసుకువచ్చిన బైక్ అక్కడ ఉన్న కౌంటర్‌ను ఢీ కొట్టింది. ఆ ధాటికి బైక్‌పై ఉన్న యువకుడు ఎగిరి కింద పడ్డాడు. ఆ యువకుడికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని బావిస్తున్నారు. ద్విచక్రవాహనాన్నిస్టేషన్‌కు తరలించారు.