BIGGBOSS: మా సిద్ధిపేట రైతు బిడ్డకు అభినందనలు: హరీష్ రావు

బిగ్‌బాస్‌ సీజన్‌ - 7 విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అభినందనలు తెలిపారు.

By అంజి
Published on : 18 Dec 2023 12:24 PM IST

BIGGBOSS, Siddipet, farmer,Pallavi Prashant, Harish Rao

BIGGBOSS: మా సిద్ధిపేట రైతు బిడ్డకు అభినందనలు: హరీష్ రావు

బిగ్‌బాస్‌ సీజన్‌ - 7 విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అభినందనలు తెలిపారు. ''మా సిద్ధిపేటకు చెందిన 'రైతు బిడ్డ' విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉంది. పొలాల నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సీజన్‌లో రైతుగా బరిలోకి దిగిన పల్లవి ప్రశాంత్‌ సామాన్యుల ధృడ సంకల్పానికి ప్రతీకగా నిలిచారు'' అని హరీశ్ రావు ట్వీట్‌ చేశారు.

రైతు బిడ్డగా గుర్తింపు పొందిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ గెలుచుకున్నాడు. అమర్‌దీప్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. శొంఠినేని శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్.. ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. 35 లక్షల రూపాయలు అతనికి ప్రైజ్ మనీగా అందింది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలవడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఓ సామాన్యుడిలా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ ఇప్పుడు సెలెబ్రిటీగా మారాడు.

Next Story