సీఎం పదవిని ఆశించిన మాట నిజమే కానీ..: భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  7 Dec 2023 12:05 PM IST
bhatti,  cm post, revanth reddy, congress,

 సీఎం పదవిని ఆశించిన మాట నిజమే కానీ..: భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. అయితే.. తెలంగాణ సీఎం అభ్యర్థిపై మాత్రం కొంత సస్పెన్స్‌ నెలకొన్న విషయం తెలిసిందే. ఎవరిని సీఎం చేయాలనే దానిపై తర్జనభర్జనలు చేసిన తర్వాతే రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఆయన ప్రమాణస్వీకారానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లోనే ఆయన ప్రమానం చేయనున్నారు. అయితే.. రేవంత్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. అందుకే మూడ్రోజుల పాటు సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగింది. తాజాగా ఇదే విషయంపై భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి ఆశించిన వారి లిస్ట్‌లో ఉన్నారు.

అయితే.. ముఖ్యమంత్రి పదవి ఆశించిన భట్టి విక్రమార్క.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి స్పందించారు. తాను కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించిన విషయం నిజమేనని అన్నారు. అయితే.. అందరికీ పదవులు దక్కడం అసాధ్యమన్న విషయం కూడా చెప్పారు. తాము ఏఐసీసీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ సీఎంగా ఏఐసీసీ ఎంపిక చేసిందని అన్నారు భట్టి. హైకమాడ్‌ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని భట్టి విక్రమార్క చెప్పారు. కాగా.. మల్లు భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంగా పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. రేవంత్‌రెడ్డితో పాటే భట్టి కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Next Story