బాలికల కాలేజ్‌ లేడీ ప్రిన్సిపాల్‌ రూమ్‌లో బీర్లు.. మంత్రి ఉత్తమ్ సీరియస్

సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌ నిర్వాకం బయటపడింది.

By Srikanth Gundamalla  Published on  7 July 2024 8:23 AM IST
beer,  suryapet, ladie shostel, principal, students strike,

బాలికల కాలేజ్‌ లేడీ ప్రిన్సిపాల్‌ రూమ్‌లో బీర్లు.. మంత్రి ఉత్తమ్ సీరియస్

సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌ నిర్వాకం బయటపడింది. ప్రిన్సిపాల్‌ వేధింపులకు గురి చేస్తున్నారని రెండ్రోజులుగా విద్యార్థినిలు ఆందోళనలు చేశారు. ఇక శనివారం ఏకంగా ప్రిన్సిపాల్ రూమ్‌లో 4 బీర్ బాటిళ్లను విద్యార్థినులు బయటకు తీశారు. ప్రిన్సిపల్ శైలజ తమతో దురుసుగా ప్రవర్తిస్తూ.. బోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని విద్యార్థినిలు ఆవేదన చెందుతున్నారు. ప్రశ్నిస్తే చేయి చేసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇక సూర్యాపేట-జనగామ రహదారిపై విద్యార్తినులు బైఠాయించి నిరసన తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల రీజినల్ కో -ఆర్డినేటర్ అరుణకుమారి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. ఇక తాజాగా ప్రిన్సిపల్ శైలజ ఏకంగా తన చాంబర్‌లో కేర్‌టేకర్‌ సౌమిత్రితో కలిసి అర్ధరాత్రి వరకు బీర్లు తాగారని విద్యార్థినులు చెప్పారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో వేణుమాధవరావు, ఆర్సీవో అరుణకుమారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, డీఎస్పీ రవికుమార్‌, సీఐ రాజశేఖర్‌, రూరల్‌ ఎస్సై బాలునాయక్‌ కళాశాలకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. శైలజను సస్పెండ్‌ చేయడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.

మరోవైపు ఈ సంఘటనపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రిన్సిపల్ రూమ్‌లో బీరు సీసాలు దొరకడం పట్ల మండిపడ్డారు. విచారణ జరిపించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ పవార్‌ను ఫోన్‌లో ఆదేశించారు.

Next Story