'సిరిమల్లెలో రామ రఘుమెల్లెలో' అంటూ సాగే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించిన అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జెన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ దీపికారెడ్డి , ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్, హాజ్ కమిటీ చైర్మన్ సలీం, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.
ఇదిలాఉంటే.. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే చీరల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. 24 రకాల డిజైన్లు, 10 ఆకర్షనీయమైన రంగులతో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో చీరలను ప్రభుత్వం తయారు చేయించింది. ఇందుకోసం రూ.339 కోట్లను ఖర్చుచేసింది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.