కాంగ్రెస్‌ను రానివ్వొద్దంటూ హైదరాబాద్‌లో వెలసిన బ్యానర్లు (వీడియో)
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 5:21 AM GMTకాంగ్రెస్‌ను రానివ్వొద్దంటూ హైదరాబాద్‌లో వెలసిన బ్యానర్లు
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీలు ఈసారి ఎలాగైనా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించి తాము అధికారం చేపట్టేందుకు ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల మధ్య విమర్శలు వాడీవేడిగా నడుస్తున్నాయి. నేరుగా ప్రచారంలో పాల్గొనడే కాదు.. సోషల్ మీడియా, యాడ్స్ ద్వారా ఓటర్ల వద్దకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు పెట్టారు. ప్రస్తుతం నగరంలో ఈ బ్యానర్లు కలకలం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఒకరిపై మరొకరు వ్యతిరేక ప్రచార వీడియోలను చేస్తూ ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఈ సమయంలోనే హైదరాబాద్ శివారు ప్రాంతంలో
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెలిసిన బ్యానర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. తెలంగాణ పోరాట సమయంలో ఎంతోమంది విద్యార్థులు, ఉద్యమకారులు తెలంగాణ కావాలంటూ తమ ప్రాణాలను సైతం బలితీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి వెనుకంజు వేసిందనీ.. అందువల్లే ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకోవాల్సి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. తద్వారా ప్రాణ త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటున్నారు. దాంతో.. కాంగ్రెస్ పార్టీ అంటే ద్వేషం ఉన్న కొందరు వ్యక్తులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులను, ఉద్యమకారులను బలి తీసుకున్న కాంగ్రెస్‌ను తెలంగాణలోకి రానివ్వద్దు అంటూ.. అలాగే బ్యానర్లపై ఉద్యమకారుల ఫోటోలు పెట్టి ఉద్యమకారులను బలి తీసుకున్న కాంగ్రెస్ ని తెలంగాణలో బతకనివ్వద్దు అంటూ ఇలా రకరకాల బ్యానర్లు హైదరాబాద్ నగర శివారులో వెలిశాయి. ఈ బ్యానర్లు ఇప్పుడు హల్చల్ సృష్టిస్తున్నాయి.