రాజన్న ఆలయానికి బ్యాంక్ కష్టాలు..!

Bank difficulties for Rajanna temple. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు కానుకలను సమర్పించుకోవడం ఆనవాయితీగా

By Medi Samrat
Published on : 17 Feb 2021 4:42 PM IST

Bank difficulties for Rajanna temple.
రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు కానుకలను సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. రాజన్నకు గోల్డ్‌ బాండ్లతో అదనపు ఆదాయం సమకూరుతున్నది. హుండీ ద్వారా సమకూరిన బంగారాన్ని గడిచిన 20 ఏళ్లుగా ఆలయ అధికారులు జాతీయ బ్యాంకుల్లో బాండ్ల రూపంలో డిపాజిట్‌ చేస్తుండగా ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వడ్డీ వస్తున్నది. ఇక దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో హుండీలు చిల్లర నాణేలతో నిండిపోయాయి. ఈ క్రమంలో భక్తులు కానుకలు సమర్పించేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.


ఆలయానికి భక్తుల నుంచి కానుకల రూపంలో ఏటా 18 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇందులో సుమారు 2కోట్ల రూపాయల వరకు చిల్లర నాణేలు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఇటీవల డిజిటల్ చెల్లింపులు పెరగడంతో చిల్లర నాణేల వినియోగం తగ్గింది. దీంతో బ్యాంకులు చిల్లర నాణేలు డిపాజిట్ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలిపారు.

ఈ క్రమంలోనే చిల్లర నాణెలతో హుండీలు త్వరగా నిండుతున్నాయని వెల్లడించారు. జనవరి 27వ తేదీన హుండీలు లెక్కించగా కోటి 50 లక్షల ఆదాయం సమకూరిందని... మరిన్ని హుండీలను నేడు లెక్కిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఆలయాలు మూతపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భక్తుల రద్ది బాగానే తగ్గినా ఈ మద్య మళ్లి పుంజుకుంటుంది.


Next Story