బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై కేసు నమోదు
బీఆర్ఎస్ కీలక నేత, పార్టీ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చిక్కుల్లో పడ్డారు.
By Srikanth Gundamalla Published on 24 March 2024 3:45 PM ISTబీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై కేసు నమోదు
బీఆర్ఎస్ కీలక నేత, పార్టీ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం సంతోష్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాగా.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్‌నెంబర్-14లో ఓ భూవివాదానికి సంబంధించిన విషయంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో.. సంతోష్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్ రావుపై నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న భూమిని కబ్జా చేయాలని సంతోష్ కుమార్ ప్రయత్నించారని నవయుగ కంపెనీ ఆరోపిస్తోంది. నకిలీ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు సృష్టించి తమకు సంబంధించిన భూమిని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు సంతోష్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రోడ్‌నెంబర్ 14లో NECL కంపెనీకి చెందిన భూమిలో సంతోష్ అక్రమంగా రూములు కట్టారని ఫిర్యాదులో చింతా మాధవ్ పేర్కొన్నారు. ఈ విషయంపై బాధితులు మార్చి 21న ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నేత సంతోష్ కుమార్‌తో పాటు లింగారెడ్డి శ్రీధర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు 420, 468, 471, 447, 120(B) r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.