అమ్మవారి కృపతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలి : బండి సంజ‌య్‌

Bandi Sanjay wishes CM KCR a speedy recovery.తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2022 8:00 AM GMT
అమ్మవారి కృపతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలి : బండి సంజ‌య్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్‌కు ఎడమ చేయి లాగడంతో పాటు, నీరసంగా ఉండటంతో.. హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేయించుకోనున్నారు. కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో.. ఆయన నేటి యాదాద్రి పర్యటన ర‌ద్దు చేసుకున్నారు.

రెండు రోజులుగా సీఎం కేసీఆర్‌గా వీక్‌గా ఉన్నారని డా.ఎం.వి.రావు తెలిపారు. ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారని, ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తామని తెలిపారు. జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని, సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని ఎం.వి.రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, ఎంపీ సంతోష్‌ కుమార్‌లు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు అన్న వార్త తెలుసుకున్న ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానులు ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.' అని భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ట్వీట్ చేశారు.

Next Story
Share it