హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి చెందిన బండ ప్రకాష్ ముదిరాజ్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే పోటీలో ఉన్నందున, ఆయన ఆ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన బండా ప్రకాష్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు.
డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాష్ ఎన్నిక కావడం అందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బండ ప్రకాష్ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని పైకొచ్చారని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా పని చేశారని, అలాగే ముదిరాజ్ సంఘం కోసం చేసిన బండ ప్రకాష్ సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. రాజ్యసభ నుండి రాష్ట్ర రాజకీయాలకు రావాలని తాను కోరానని అన్నారు. 1981లో మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బండ ప్రకాష్.. 2017లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎ
ఎమ్మెల్సీ కోటా నుంచి 2021లో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ముదిరాజు సామాజిక వర్గానికి చెంది బండా ప్రకాష్.. ఎమ్మెల్సీ పదవి కాలం 2021 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు ఉండనుంది. 2018లో బండా ప్రకాష్ రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారు. 33 ఓట్ల ఆధిక్యతో గెలుపొందారు. 2018 మార్చి 23న టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు.