తెలంగాణలో బాణసంచాపై నిషేధం ఎత్తివేత.. కానీ..

Ban Lifted On Crackers In Telangana. తెలంగాణలో బాణాసంచాపై నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

By Medi Samrat  Published on  13 Nov 2020 5:47 PM IST
తెలంగాణలో బాణసంచాపై నిషేధం ఎత్తివేత.. కానీ..

తెలంగాణలో బాణాసంచాపై నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా హైకోర్టు బాణాసంచా విషయంలో ఇచ్చిన తీర్పును మారుస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లో బాణాసంచా అమ్మకానికి గాని కాల్చయడానికి గాని అనుమతులు లేవంటూ ఎవరైనా షాపులు పెడితే కేసులు నమోదు చేయాలని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు మొన్న తీర్పు చెప్పింది.

ఈ మేరకు తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఎన్జీటీ తీర్పునకు లోబడి హైకోర్టు ఆదేశాలు ఉండాలని పేర్కొంది. ఇక వాయు కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలు పట్టణాల్లో బాణాసంచా పూర్తిగా నిషేధించాలని ఎన్జీటీ పేర్కొంది. గాలి నాణ్యత తక్కువగా ఉన్న నగరాల్లో ప్రస్తుతానికి టపాసులు పూర్తిగా నిషేధం ఉండగా.. గాలి నాణ్యత పర్లేదు అనుకున్న ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ కి అనుమతి లభించింది.

ఇక తెలంగాణలో హైదరాబాద్, నల్లగొండ, పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉన్న కారణంగా ఈ ప్రాంతాల్లో మాత్రం నిషేధం కొనసాగుతోంది. ఇక తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకొవచ్చని సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.

ఇదిలావుంటే.. షాపులు తెర‌వ‌ద్దు అనే‌ విషయం ముందే చెప్పి ఉంటే తాము కోట్ల రూపాయల సరుకు ముందే కొన్ని ఉండేవాళ్ళం కాదని.. ఇప్పుడు నిషేధం విధిస్తే ఆ సరుకంతా ఎక్కడ పెట్టాలో తెలియని ప‌రిస్థిత‌ని.. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదని వ్యాపారులు వాపోతున్నారు.


Next Story