జగిత్యాల జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం ఒక్కో చేయి, కాలుకు ఆరు చొప్పున.. మొత్తం 24 వేళ్లతో మగబిడ్డ జన్మించాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఎరగట్లకు చెందిన సుంగారపు రవళి మొదటి ప్రసవం కోసం కోరుట్ల ఆసుపత్రిని ఆశ్రయించింది. సాధారణ ప్రసవంలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు అతని రెండు చేతులపై ఒక్కొక్కటి ఆరు వేళ్లు, అతని కాళ్ళకు ఆరు వేళ్లు ఉన్నాయి. తల్లి, బిడ్డ ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్య పరిభాషలో దీనిని పాలీడాక్టిలీ కండిషన్ అని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పాలిడాక్టిలీ కండిషన్‌తో జన్మించిన శిశువుల గుండెలో రంధ్రం ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు. రవళికి కడుపు నొప్పి రావడంతో తొలుత మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. అక్కడే మగబిడ్డకు రవళి జన్మనిచ్చింది.