తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
By Srikanth Gundamalla Published on 30 Nov 2023 11:45 AM GMTతెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అదే రోజు విడుదల కానున్నాయి.
కాగా.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ముగిసింది. ర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,ఇల్లెందు, కొత్తగూడెం, ఆశ్వరావుపేట,భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కు తెరపడింది. 5 గంటల లోపు పోలింగ్ బూత్ ల వద్ద క్యూ లైన్లలో ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఓటింగ్‌కు ముందు ఎగ్జిట్ పోల్స్‌పై ఇదివరకు విధించిన నిషేధాన్ని తాజాగా ఎన్నికల సంఘం సవరించింది. సాయంత్రం 5.30గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించవచ్చని తెలిపింది. తొలుత నవంబర్ ఏడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సమయంలో మార్పులు చేసింది. నవంబర్ 7 నుంచి విడతల వారీగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది.
డిసెంబర్ 3న ఎన్నికల మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా జరగనుంది. ఎన్నికల్లో నిలబడ్డ 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం 3న తేలనుంది. తదుపరి ప్రభుత్వం ఎవరిదో తేలిపోనుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మరోవైపు పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తే వాటిని ఎన్నికల అధికారులు వెంటనే మార్చేశారు. ఇక పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు వినూత్న ప్రయత్నాలు చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గడం నిరాకశజనకమైన విషయమనే చెప్పాలి.