అసదుద్దీన్ ఒవైసీకి సామాజిక కార్యకర్త వార్నింగ్
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి వార్నింగ్ ఇస్తూ ఓ వీడియోను సామాజిక కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
By అంజి Published on 13 July 2023 12:49 PM ISTఅసదుద్దీన్ ఒవైసీకి సామాజిక కార్యకర్త వార్నింగ్
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి వార్నింగ్ ఇస్తూ ఓ వీడియోను సామాజిక కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో చక్కర్లు కొడుతుంది. సామాజిక కార్యకర్త మహమ్మద్ సలీం వార్నింగ్ ఇచ్చిన ఆ వీడియో సోషల్ మీడియాలో నానా హంగామా సృష్టిస్తుంది. ''నీపై ఎప్పుడు ఏమైనా జరగవచ్చు... భగవంతుడు నీకు ఇచ్చినఅధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతి ఒక్కరిపై అన్యాయంగా కేసులు పెడుతున్నావు. నీ అధికార దాహంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చెయ్యవద్దు''.. అంటూ అసదుద్దీన్‌పై సామాజిక కార్యకర్త మహమ్మద్ సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు.
''అధికారంలో ఉన్నామని విర్రవీగుతున్న నీపై ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.. ఆ సమయంలో నిన్ను రక్షించడానికి అమిత్ షా, నరేంద్ర మోదీ ఇచ్చిన సెక్యూరిటీ కూడా పనిచేయదు. అధికారాన్ని దుర్వినియోగం చేసే వారిని దేవుడు వారి నుండి అధికారాన్ని తీసేసుకుంటాడు. నాకు సెక్యూరిటీ ఉంది కదా అని ధీమాగా ఉండకు ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా సమయం వస్తే ఒక తుపాకి తూటాతో కుప్పకూలిపోతావు. నిత్యం ఎంతో సెక్యూరిటీతో తిరిగే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి పవర్ఫుల్ నేతలను కూడా భద్రత సిబ్బంది కాపాడలేక పోయారు'' అని అన్నారు.
''మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్లో అతిక్ అహ్మద్ ఆషార్ అతని తమ్ముడు అష్రఫ్ హత్యకు గురైన ఘటన తెలిసిందే. ఇలాంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. ఉత్తరప్రదేశ్లో అతిక్ అహ్మద్, అతని తమ్ముడికి ఎంత సెక్యూరిటీ ఉన్న కూడా ముగ్గురు యువకులు వచ్చి ఒక్క నిమిషంలో వారిని కాల్చి చంపేశారు. అధికార దుర్వినియోగం చేస్తే భగవంతుడు సైతం ఆగ్రహం చెంది నీకు ఇచ్చిన అధికారాన్ని నీ నుండి తీసుకుంటాడు. మోదీ నీకు ఇచ్చిన Y+ నిన్ను కాపాడుతుందని అనుకోకు ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా పెద్ద పెద్ద నేతలు ఒక్క తుపాకీ గుండుతో చనిపోయిన ఘటనలు ఎన్నో'' అంటూ ఓవైసీకి వార్నింగ్ ఇస్తూ సామాజిక కార్యకర్త మహమ్మద్ సలీం ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తూ చక్కర్లు కొడుతుంది.