డల్లాస్ ఎక్కడ అని అడిగితే కమిషనర్ సీరియస్‌గా వెళ్ళిపోయారు : అంజన్ కుమార్ యాదవ్

Congress Leaders Protest at GHMC Office in Hyderabad. డల్లాస్ ఎక్కడ వుందని అడిగితే కమిషనర్ సీరియస్‌గా వెళ్ళిపోయారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  28 July 2023 4:20 PM IST
డల్లాస్ ఎక్కడ అని అడిగితే కమిషనర్ సీరియస్‌గా వెళ్ళిపోయారు : అంజన్ కుమార్ యాదవ్

డల్లాస్ ఎక్కడ వుందని అడిగితే కమిషనర్ సీరియస్‌గా వెళ్ళిపోయారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కేటీఆర్‌ను ఒక్క మాట కూడా అనకుండా బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోజ్ వెళ్లిపోకుండా సిగ్గు చేటని అన్నారు. న‌గ‌రంలో వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ తీరును వ్య‌తిరేకిస్తూ.. టీపీసీసీ నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యం ముట్ట‌డికి పిలుపునిచ్చింది. భారీ ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు జీహెచ్ఎంసీ కార్యాల‌యాన్ని ముట్ట‌డించారు. అనంత‌రం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ముంపు కాలనీ వాసులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఏమి చెప్పకపోవడంతో కమిషనర్ ఎలాంటి హామీ ఇవ్వలేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ముంపు ప్రాంత వాసులకు నిత్యావసర వస్తువులను అందించాలని కమిషనర్ ను కోరామని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు.

సముద్రాన్ని నగరానికి తీసుకువచ్చిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీకే దక్కిందని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎస్ఎన్డీపీ ఆగిపోయింది. ముంపు ప్రాంతాల్లో ఫుడ్ పాకెట్స్ పంపలేదు. ఈ సారి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజు వారీ కూలీలకు పని లేదు.. వారికి ఉపాధి కల్పించాలన్నారు. ముంపు వాసులకు 15 వేల రూపాయలు ఇవ్వాలని ఖైర‌తాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి డిమాండ్ చేశారు.

కార్పోరేటర్ రజిత మాట్లాడుతూ.. ఇది డల్లాస్ కాదు.. నగరాన్ని కేసీఆర్, కేటీఆర్ కలిసి కల్లాస్ చేశారని విమ‌ర్శించారు. అభివృద్ధి చేసాము అన్నారు.. అండర్ పాస్ లలో నీరు చేరిందని.. మీ అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు నగరం ఎందుకు మునగలేదని ప్ర‌శ్నించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు నాళాలు కబ్జా కాలేదు.. అందుకే నగరం మునగలేదని వివ‌రించారు. నగరం అభివృద్ధి చేశామ‌ని చెప్పిన మాటలు ఉత్తివేన‌న్నారు.


Next Story