రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్..కోర్టు తీర్పుపై అమృత రియాక్షన్ ఇదే
ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కోర్టు శిక్ష విధించడంపై అతని భార్య అమృత స్పందించారు.
By Knakam Karthik Published on 11 March 2025 8:38 PM IST
రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్..కోర్టు తీర్పుపై అమృత రియాక్షన్ ఇదే
ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కోర్టు శిక్ష విధించడంపై అతని భార్య అమృత స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. "ద వెయిట్ ఈజ్ ఓవర్.. చివరికి న్యాయం జరిగింది. పరువు పేరున జరిగే ఇలాంటి దారుణ ఘటనలను ఈ తీర్పు తగ్గిస్తుందని భావిస్తున్నాను” అని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
అదే విధంగా పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోరాటంలో తమకు మద్దతుగా నిలిచిన పోలీసు అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, మీడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ పేర్కొన్నారు. నా కొడుకు పెరుగుతున్నాడు. నా మెంటల్ హెల్త్, నా కొడుకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీడియా ముందుకు రాలేకపోతున్నా. ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నా. మా భద్రతను దృష్టిలో ఉంచుకుని మా మద్దతు దారులు, వెల్ విషర్స్ అర్థం చేసుకుంటారని అని పోస్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అదే విధంగా రెస్ట్ ఇన్ పీస్ అంటూ ప్రణయ్ కు స్తూ ఇన్స్టా పోస్ట్ పెట్టింది అమృత.
2018 సెప్టెంబర్ 14న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ హత్య అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఆమె తండ్రి మారుతీరావు, సుపారీ గ్యాంగ్‌తో కలిసి ప్రణయ్‌ను హత్య చేయించాడు. 5 నెలల గర్భవతిగా ఉన్న అమృతతో కలిసి ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా, సుభాష్ శర్మ, అతన్ని కత్తితో నరికి చంపాడు. మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకోవడంతో కేసు అతని విషయంలో నిలిచిపోయింది. పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా చెబుతూ.. 2019లో 1,600 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఐదేళ్లకు పైగా విచారణ సాగిన తర్వాత, ఈ కేసులో తాజా తీర్పు వెలువడింది.