తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు అమిత్‌షా క్లాస్!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు మరోసారి సిద్ధం అవుతున్నాయి రాజకీయ పార్టీలు.

By Srikanth Gundamalla  Published on  28 Dec 2023 1:22 PM GMT
amit shah, telangana tour, bjp,

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు అమిత్‌షా క్లాస్!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు మరోసారి సిద్ధం అవుతున్నాయి రాజకీయ పార్టీలు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. అయితే.. తాముకు ఆశించిన స్థాయిలో సీట్లు గెలవలేకపోయినా గతంలో కంటే మెరుగైన స్థానాలనే సాధించారు. అయితే.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా 10 స్థానాలను గెలవాలని చూస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లను సాధించేలా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చర్యలు మొదలుపెట్టారు. తెలంగాణ పర్యటనకు విచ్చేశారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో తెలంగాణ బీజేపీ ముఖ్యతనేతలతో అమిత్‌షా సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ నేతల మధ్య జరుగుతోన్న కోల్డ్‌ వార్‌పై అమిత్‌షా ఫోకస్‌ చేశారని తెలుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై అమిత్‌షా ఆరా తీశారని సమాచారం. పత్రిక, మీడియాలో కథనాలు కూడా రావడంతో అమిత్‌షా ముఖ్య నేతలకు క్లాస్‌ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కలిసి పనిచేయాలని అందరికీ సూచించారని సమాచారం.

ఈ మేరకు బీజేపీ నేతలతో మాట్లాడిన అమిత్‌షా.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయడం మానాలని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచిచంఆరు. దాంతో.. పార్టీ ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం హాట్‌ హాట్‌గా సాగిందని చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు. నేతల మధ్య గ్యాపే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసిందనే ప్రచారం జరుగుతోందని.. ఇది రిపీట్‌ కావొద్దని నాయకులకు అమిత్‌షా హెచ్చరించారట. ఎంపీ టికెట్‌ ఆశావహలు, వారి బలబలాలపైన ఆరా తీసిన అమిత్‌షా.. సిట్టింగ్ ఎంపీలకు అదే స్థానంలో పోటీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు ఎంపీ స్థానాలు మినహా అన్ని స్థానాల్లో పార్టీ పరిస్థితపై కూడా అమిత్‌షా ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చార్మినార్‌కు వెళ్లారు. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Next Story