ఏవీఎన్‌ రెడ్డి విజయం ప‌ట్ల హర్షం వ్యక్తం చేసిన‌ అమిత్ షా..

Amit Shah expressed happiness over AVN Reddy's victory. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు

By M.S.R  Published on  17 March 2023 5:24 PM IST
ఏవీఎన్‌ రెడ్డి విజయం ప‌ట్ల హర్షం వ్యక్తం చేసిన‌ అమిత్ షా..

Amit Shah expressed happiness over AVN Reddy's victory


తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ ద్వారా తెలంగాణ బీజేపీకి అభినందనలు తెలియజేశారు.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఏవీఎన్‌ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు, తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో అవినీతి పాలనతో విసిగిపోయారని, మోదీ నాయకత్వంలోని పారదర్శకమైన బీజేపీ ప్రభుత్వ పాలన కోరుకుంటున్నారని ఈ విజయం తెలియజేస్తోందని ట్వీట్‌ చేశారు.

హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపుతో ఎల్బీనగర్‌లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. రంగారెడ్డి అర్భన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని బీజేపీ నేతలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. విజయం సాధించిన ఏవీఎన్‌ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. అప్రజాస్వామిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్లు ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు బండి సంజయ్. బీజేపీ విజయంలో భాగమైన ఉపాధ్యాయులకు అభినందనలు చెప్పారు.




Next Story