'2,800 బస్సులను రిట్రో ఫిట్మెంట్ కింద కేటాయించండి'.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

హైదరాబాద్ మహానగరంలో వంద శాతం బస్సులను ఎల‌క్ట్రిక్ మోడ‌ల్‌లోకి మార్చేందుకు స‌హ‌క‌రించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి విజ్ఞ‌ప్తి చేశారు.

By అంజి  Published on  17 Jan 2025 7:13 AM IST
2800 buses, retro fitment, CM Revanth, Union Minister HD Kumaraswamy

'2800 బస్సులను రిట్రో ఫిట్మెంట్ కింద కేటాయించండి'.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

కాలుష్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో వంద శాతం బస్సులను ఎల‌క్ట్రిక్ మోడ‌ల్‌లోకి మార్చేందుకు స‌హ‌క‌రించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్యమంత్రి.. ఢిల్లీలో కుమార‌స్వామిని వారి కార్యాల‌యంలో కలిసి ఈ విషయంపై చర్చించారు. పీఎం ఈ-డ్రైవ్ (PM E-Drive) ప‌థ‌కం కింద జీసీసీ ప‌ద్ధ‌తిలో తెలంగాణకు బ‌స్సులు కేటాయించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గుర్తుచేశారు.

ప్ర‌స్తుతం ఉన్న డీజిల్ బ‌స్సుల‌కు ఎల‌క్ట్రిక్ కిట్ అమ‌ర్చి రిట్రో ఫిట్మెంట్ ప‌ద్ధ‌తిలో ఎల‌క్ట్రిక్ బ‌స్సులుగా మార్చేందుకు అవ‌కాశం ఉన్న విష‌యాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. హైద‌రాబాద్‌కు కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించే 2,800 బ‌స్సుల‌ను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడ‌ల్ కింద కేటాయించాల‌ని ముఖ్యమంత్రి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్య‌మంత్రి వెంట మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌లు, పలువురు ఎంపీలు, అధికారులు ఉన్నారు.

Next Story