నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలని ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే నేతలను ఆదేశించారు. ఇందిరా భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయేది మన ప్రభుత్వమే.. మనం కష్టపడితే అధికారం మనదేనని సూచించారు. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందని పేర్కొన్నారు. కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనకు పేపర్, చానల్స్ ఉన్నాయి.. తను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని.. రోజు ఒక వర్గానికి ఏదో ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని.. ఇవన్నీ పచ్చి అబద్దాలు.. వాటిని మీరు అవగాహన చేసుకొని వాస్తవాలను జనంలోకి తీస్కొని పోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అర్థం అయ్యే విదంగా, గట్టిగా వాస్తవాలను ప్రచారం చెయ్యాలని నేతలకు సూచించారు. జనంలోనే ఉండాలి.. వాళ్లకు కేసీఆర్ చెప్తున్న అబద్దాలు వివరించాలి. మనం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా వివరించాలని నేతలతో అన్నారు.