Video: బుర్కా వేసుకుని మహిళల పక్కన కూర్చున్న వ్యక్తి.. కోరుట్ల బస్టాండ్‌లో ఘటన

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల బస్టాండ్‌లో ఒక యువకుడు బుర్కా వేసుకుని మహిళల మధ్య కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

By -  అంజి
Published on : 18 Feb 2026 12:24 PM IST

Korutla Bus Stand incident, Jagtial district news, Youth in Burqa caught, Telangana Free Bus Travel scheme, Mahalakshmi Scheme misuse suspect, Burqa disguise in bus stand

Video: బుర్కా వేసుకుని మహిళల పక్కన కూర్చున్న వ్యక్తి.. కోరుట్ల బస్టాండ్‌లో ఘటన

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల బస్టాండ్‌లో ఒక యువకుడు బుర్కా వేసుకుని మహిళల మధ్య కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనుమానం వచ్చిన బస్టాండ్ సిబ్బంది అతడిని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. కోరుట్ల బస్టాండ్‌లో మహిళల కోసం కేటాయించిన సీట్లలో ఒక వ్యక్తి బుర్కా ధరించి కూర్చున్నాడు. అయితే అతడి ఆహార్యం, కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అక్కడి సిబ్బంది గమనించారు.

బస్టాండ్ సిబ్బంది దగ్గరకు వెళ్లి ప్రశ్నించగా, బుర్కాలో ఉన్నది మహిళ కాదు, ఒక యువకుడని తేలింది. సిబ్బంది అతడిని ఎందుకు ఇలా చేశావని నిలదీయగా, ఆ యువకుడు సరైన సమాధానం చెప్పకుండా నవ్వుతూ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడి వారు విస్మయానికి గురయ్యారు. ఈ ఘటనపై ప్రస్తుతం రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది.

ఈ ప్రయోజనాన్ని పొందేందుకే ఆ యువకుడు మహిళా వేషధారణలో వచ్చాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా మహిళల మధ్య ఉండి మరేదైనా అకృత్యాలకు లేదా చోరీలకు పాల్పడే ఉద్దేశ్యంతో బుర్కా ధరించాడా? అనే కోణంలోనూ పోలీసులు ఆలోచిస్తున్నారు. బస్టాండ్ సిబ్బంది ఫిర్యాదు మేరకు అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆ యువకుడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? బుర్కా ధరించడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story