విద్యార్థులకు ఏ ఆపద వచ్చినా.. తల్లిదండ్రుల్లా తానున్నంటూ ధైర్యం ఇవ్వాల్సిన ఉపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించాడు. ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు కర్కశంగా ప్రవర్తించాడు. దీని కారణంగా ఆమె కారణంగా విద్యార్థిని రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఈ అవమానీయ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సాంఘిక గురుకుల కాలేజీలో చోటు చేసుకుంది. హాలీడేస్ అయిపోయిన తర్వాత ఆలస్యంగా విద్యార్థిని కాలేజీకి వచ్చిందని కర్కశత్వంగా ప్రవర్తించాడు. ఐదు రోజుల పాటు వరుసగా 9 గంటల పాటు విద్యార్థిని తరగతి బయట నిలబెట్టాడు ఉపాధ్యాయుడు.
వివరాల్లోకి వెళ్తే.. బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని నిహారిక.. రెండు రోజులు సెలవు తీసుకుంది. సెలవు ముగిసిన తర్వాత ఆలస్యంగా కాలేజీకి వచ్చింది. దీంతో ఐదురోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిలబెట్టి కామర్స్ లెక్చరర్ శిక్షించారు. చాలా గంటలు నిల్చోవడం వల్ల కాళ్లకు రక్త ప్రసరణ ఆగి విద్యార్థిని అక్కడికక్కడే కుప్పకూలింది. దీంతో ఆస్పత్రికి తీసుకోని వెళ్లడంతో చికిత్స చేసిన డాక్టర్లు విద్యార్థిని కాళ్లు చచ్చుబడిపోయాయని తెలిపారు. జ్వరం తీవ్రంగా ఉండటంతో పడిపోయిన తరవాత ఇంటికి తీసుకొని వెళ్లారని నిహారిక తెలిపింది.
అయితే మళ్లీ ఇంటి దగ్గర కూడా విద్యార్థిని కింద పడిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకొని వెళ్లారని అక్కడ పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి దృష్టికి వెళ్లింది. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. సంబంధిత లెక్చరర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్దిని పట్ల అవమానీయంగా వ్యవహరించిన కామర్స్ లెక్చరర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రిన్స్‌పల్ కల్యాణిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన నిహారిక జ్వరం రావడంతో లీవ్ తీసుకుందని తోటి విద్యార్థులు తెలిపారు. అయితే కామర్స్ లెక్టరర్ వ్యవహరించిన తీరుతో విద్యార్దిని ఆరోగ్యం మరింత చెడిపోయిందని తోటి విద్యార్థులు తెలిపారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.