సామాన్యులకు షాక్.. మరింత పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు!
కిలో ఉల్లిగడ్డ ధర మరో వారం, పది రోజుల్లో రూ.100కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
By అంజి
సామాన్యులకు షాక్.. మరింత పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు!
కిలో ఉల్లిగడ్డ ధర మరో వారం, పది రోజుల్లో రూ.100కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల కిందటి వరకు కిలోకు రూ.30 నుంచి రూ.40 ఉండగా.. ప్రస్తుతం రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. రాష్ట్రంలో సాగు తగ్గడం, మార్కెట్లోకి సరిపడా ఉల్లిగడ్డ రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని వచ్చే రెండు, మూడు నెలలు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు.
కాగా మార్కెట్‌లో ఉల్లి ధర పెరుగుతుందటంతో ఉల్లి పంట సాగు చేసేందుకు రైతులు అధిక ఆసక్తి చూపుతున్నారు. నెల కిందట ఉల్లి మడి ధర రూ. 500 పలికింది. నేడు మడి రూ. 2500నుంచి రూ. 3000 వరకు ధర పలుకుతోంది. ఉల్లికి ధర పెరగడంతో నారు సాగు చేసిన రైతులు అమాంతంగా రేటు పెంచేశారు. ఉల్లి విత్తనాల రేటు కూడా కిలో రూ.150 నుంచి రూ. 600 వరకు పెరిగింది. ఒక ఎకరానికి 200 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి.
కారణాలు ఏవైనా ప్రజల ఆహారానికి సంబంధించిన వస్తువుల ధరల్లో పెరుగుదల నమోదైతే వారి నెల వారీ బడ్జెట్‌పై భారీ ప్రభావం చూపుతోంది. వెల్లుల్లి ఈ ఏడాది రూ.400 నుంచి రూ.200 వరకు తగ్గింది. తాజాగా రూ.300 నడుస్తోంది. ఇక నూనె ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం లీటర్ నూనె ధర రూ.145గా ఉంది.