అది సీక్రెట్ మీటింగ్ కానే కాదు.. ఆ నేతలంతా కలిసి చేస్తున్న తిరుగుబాటు

A Secret meeting that never was.. it is MLA's Vivek, Bethi Subhash vs Minister Malla Reddy. బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాస్ రెడ్డి డిసెంబర్ 19 ఉదయం డాక్టర్ ఎ.ఎస్.రావు నగర్ వద్ద

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Dec 2022 12:11 PM IST
అది సీక్రెట్ మీటింగ్ కానే కాదు.. ఆ నేతలంతా కలిసి చేస్తున్న తిరుగుబాటు

బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాస్ రెడ్డి డిసెంబర్ 19 ఉదయం డాక్టర్ ఎ.ఎస్.రావు నగర్ వద్ద నాలా రిటైనింగ్ వాల్, రెండు కొత్త రోడ్ల ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సి ఉంది. ఎమ్మెల్యే కొంచెం ఆలస్యంగా వస్తారని అందరూ అనుకున్నారు.. ఆయన కోసం బీఆర్‌ఎస్ కేడర్‌తో పాటు పలువురు ప్రజా సంఘాల సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఎమ్మెల్యే ఎంత సేపటికీ రాలేదు.. చివరికి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఎందుకంటే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో సమావేశం కొన్ని గంటలపాటు సాగింది. పొద్దున్నే టిఫిన్ సమయానికి వెళ్లగా.. మధ్యాహ్న భోజనం సమయం వరకూ మీటింగ్ సాగింది. అది మామూలు సమావేశం అయితే కాదని అంటున్నారు. ఐదుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హాజరై మంత్రి మల్లారెడ్డిపై 'తిరుగుబాటు'కు తెరలేపారని చెబుతున్నారు.

హనుమంతరావు ఇంటిలో మీటింగ్ కు హాజరైన వారిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె పాండు వివేకానంద్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాస్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు ఉన్నారు. ఈ సమావేశాన్ని ఎన్నికల ప్రణాళికగా చెబుతున్నప్పటికీ ఇంకా వేరే ఏదో ఉందనే చెబుతున్నారు. మల్లారెడ్డి తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఈ 'రహస్య సమావేశం' జరిగింది. మీటింగ్ లో పాల్గొన్న వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు భూమికి సంబంధించిన సమస్యలపై మంత్రి సిహెచ్‌ మల్లారెడ్డితో విబేధించారని, మిగిలిన వారు కూడా ఆయనపై కోపంతో ఉన్నారని అంతర్గత వ్యక్తి న్యూస్‌మీటర్‌కు తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు, మల్లారెడ్డిల మధ్య ఎప్పటి నుంచో రాజకీయ విబేధాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే.

`రహస్యం`గా సాగాల్సిన ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యేలే స్వయంగా లీక్ చేయడంతో అనతికాలంలోనే చర్చనీయాంశంగా మారింది. ఈ నాయకులలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిలకు ఓ 'కాల్' కూడా వచ్చిందని న్యూస్‌మీటర్‌కి తెలిసింది. సాధారణంగా మీడియాకు అందుబాటులో ఉండే ఈ ఎమ్మెల్యేలు NewMeter కాల్‌లు, సందేశాలకు సోమవారం నాడు సమాధానం ఇవ్వలేదు.

బేతి సుభాస్ రెడ్డి Vs మల్లా రెడ్డి:

మేడ్చల్ నియోజకవర్గంలోని సుచిత్ర ప్రధాన రహదారిపై 2 ఎకరాల స్థల వివాదం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డిల మధ్య గొడవకు కారణమైంది. భూ వివాదం దశాబ్ద కాలం నాటిది. సోమవారం నిర్వహించిన మీటింగ్ లో ఎమ్మెల్యేలు వివేక్‌, సుభాస్‌రెడ్డిలు చాలా ముఖ్యమైన వారని తెలిసిందే. చర్చలు, రాజకీయ సమావేశాల్లో ఆధిపత్యం వహించే మంత్రి మల్లారెడ్డితో రాజకీయంగా, వ్యక్తిగతంగా పోటీ పడడమే ఈ మీటింగ్ కు ప్రధాన కారణమని కీలక వర్గాలు చెబుతున్నాయి.

వివేకానంద్ గౌడ్ Vs మల్లా రెడ్డి

వివేక్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్.. మల్లా రెడ్డి నియోజకవర్గం మేడ్చల్. అనేక ప్రదేశాలలో ఈ రెండు నియోజకవర్గాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి. తనను పిలిస్తే తప్ప ఎమ్మెల్యేల పనులు చేయవద్దని జిల్లా కలెక్టర్‌తో మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లు అంతర్గత వ్యక్తి తెలిపారు. కీలక సమావేశంలో చర్చించిన కొన్ని అంశాల్లో ఇది ఒకటని తెలుస్తోంది.

కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో.. 90% గ్రామీణ, 10% పట్టణ ప్రాంతాలను కలిగి ఉంది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం తదితర ప్రాంతాలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. జిల్లా పరిషత్‌తో పాటు ఇతర గ్రామపంచాయతీలకు చైర్మన్‌ల నియామకంపై ఎమ్మెల్యే గతంలోనే మాట్లాడారు. అయితే కొంపల్లి, దుండిగల్‌, నిజాంపేట్‌ వంటి మున్సిపాలిటీల పరిధిలోకి కుత్బుల్లాపూర్‌లోని ప్రధాన భాగాన్ని తీసుకొచ్చిన తర్వాత, రూరల్‌ బెల్ట్‌పై ఎమ్మెల్యే తన ఆధిపత్యాన్ని కోల్పోయారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం సరిహద్దుల కారణంగా మల్లారెడ్డి, వివేక్ మధ్య సమస్యలు తలెత్తాయని కూడా చెబుతూ ఉంటారు.

ఆరెకపూడి గాంధీ, కృష్ణారావు Vs మల్లా రెడ్డి

సోమవారం జరిగిన ఈ సమావేశానికి ప్రధానంగా వివేక్, బేతి సుభాష్ రెడ్డి సహకరించగా, గాంధీ- కృష్ణారావులకు కూడా మల్లారెడ్డితో పలు సమస్యలు ఉన్నాయని అంటున్నారు. "మల్లా రెడ్డి ఇతరుల ఆలోచనలు, ప్రణాళికలను పట్టించుకోరని.. అతని పనితీరు శైలిని చాలా మంది స్వాగతించరు" అని ఒక మూలం జోడించింది.

మల్లారెడ్డితో మైనంపల్లికి ఉన్న వైరం చాలా పాతదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైనంపల్లి కేబినెట్ సీటుపై అందరి దృష్టి ఉండగా, నేటి కీలక సమావేశం బూస్టర్‌గా మారింది. సమావేశం అనంతరం మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డి ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని, మేడ్చల్, మల్కాజిగిరి ఇన్‌చార్జి మంత్రిగా ఉంటూ ఆయా ఎమ్మెల్యేల అంగీకారం లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేందుకు మల్లారెడ్డి మద్దతివ్వడం లేదన్నారు. GHMC ఎన్నికలలో టిక్కెట్టు దొరకని ఆశావహులు ఇతర నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మంత్రి తన వారినే మార్కెట్, లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా నియమించుకున్నారు. ఈ ఆశావహులకు మేము అన్యాయం చేసాము. ఇంతకుముందు మల్లారెడ్డితో ఈ అంశంపై చర్చించామని, అయితే ఆయన వినేందుకు నిరాకరించారని, దానికి బదులు మా ఇష్టానికి వ్యతిరేకంగా వెంటనే జీఓలు జారీ చేశారని, తాము మాత్రం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పనిచేస్తున్నామని ఆయన అన్నారు.

మల్లారెడ్డి రాజకీయ జీవితంలో పలు మలుపులు:

ఎమ్మెల్యే నుండి ఎంపీ వరకూ 70 ఏళ్ల మల్లా రెడ్డి తన సుదీర్ఘ కెరీర్‌లో చాలా వాటినే చూశారు. అయినప్పటికీ, ఆయన బహిరంగ సభల్లో మాట్లాడే మాటలు, పలు ప్రసంగాలు ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. తన కళాశాలలు, పాఠశాలల గురించి గొప్పగా చెప్పుకోవడం.. తాను ఇంత సంపాదించాను అని చెప్పుకోవడం చాలా మందికి మింగుడుపడలేదు.

ఘట్‌కేసర్‌లో జరిగిన రెడ్డి సామాజిక వర్గం సమావేశంలో కూడా గొడవలు జరిగాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన 20 వేల మందికి పైగా హాజరైన సమావేశంలో పలువురు ఆయనపై కుర్చీలు విసిరారు. మల్లారెడ్డి గ్రూపుపై ఇటీవల ఆదాయపన్ను శాఖ దాడులు కూడా హాట్ టాపిక్ గా మారాయి.

Next Story