భువనగిరి కలెక్టరేట్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
A Man suicide attempt in Yadadri Bhuvanagiri Collector Office.యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కలెక్టర్
By తోట వంశీ కుమార్ Published on
13 Dec 2021 7:03 AM GMT

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. తమ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కలెక్టర్ ఛాంబర్ వద్ద బుడిగే మహేశ్ అనే వ్యక్తి ఒంట్రిపై పెట్రోలు పోసుకున్నాడు. అనంతరం నిప్పంటించుకోవడానికి యత్నించాడు. వెంటనే అక్కడ ఉన్నవారు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు.
మహేష్ తండ్రి ఉప్పలయ్య కొలనుపాకలో 20 సంవత్సరాల క్రితం 4 ఎకరాల భూమిని రూ.6వేలకు కొనుగోలు చేశాడు. కాగా.. ఇప్పటి వరకు ఆ భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. దీంతో మనస్థాపానికి గురైన మహేష్ కలెక్టర్ వద్దకు వచ్చి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడ ఉన్న వారు అడ్డుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బాధితుడితో మాట్లాడి సమస్య పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
Next Story