రక్తంతో గీసిన పెయింట్‌ని.. మంత్రి ఎర్రబెల్లికి గిఫ్ట్‌గా ఇచ్చిన అభిమాని

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులు, అనుచరులు ఆయన పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

By అంజి  Published on  4 July 2023 3:59 PM IST
Minister Errabelli Dayakar Rao, birthday gift, Medarapu Sudhakar, Palakurthy

రక్తంతో గీసిన పెయింట్‌ని.. మంత్రి ఎర్రబెల్లికి గిఫ్ట్‌గా ఇచ్చిన అభిమాని

సినీ సెలబ్రిటీలకు, పొలిటికల్‌ లీడర్స్‌కి ఫ్యాన్‌ బేస్‌ ఎక్కువగానే ఉంటుంది. ఇక వీరి బర్త్‌ డే రోజుల్లో అభిమానులైతే కేక్‌ కట్‌ చేసి పండగ చేసుకుంటారు. మరికొందరైతే వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. తమ అభిమాన నేత పుట్టిన రోజున రక్త దానం చేయడం, అన్నదాన కార్యక్రమాలు, వృద్ధుల, రోగులకు పండ్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు. ఇలా ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం మనం చుస్తూంటం. కానీ ఓ వ్యక్తి తన అభిమాన నాయకుడికి లైఫ్‌లాంగ్‌ గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అందుకు అతడు తన రక్తాన్ని తీసి.. ఆ రక్తంతో తన అభిమాన నాయకుడి చిత్రాన్ని గీసి ఫొటో ఫ్రేమ్‌ కట్టించి ఇచ్చాడు.

ఇవాళ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినం. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న ఎర్రబెల్లికి అభిమానుల సంఖ్య ఎక్కువే. ఇవాళ అభిమానులు అతని నివాసానికి చేరుకొని బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కే.యూ జేఏసీ వైస్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి యువజన నాయకుడు డాక్టర్.మేడారపు సుధాకర్.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తన రక్తంతో గీసిన ఫొటో ఆర్ట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మేడారపు సుధాకర్ చూపిన అభిమానానికి సంతోషం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి ఆత్మీయతతో ఆలింగనం చేసుకున్నారు.

Next Story