Hyderabad: జైన సన్యాసినిగా మారబోతున్న 19ఏళ్ల యువతి

యుక్త వయసులో ఉన్నవారు జీవితంలో కొన్ని లక్ష్యాలను పెట్టుకుంటారు.

By Srikanth Gundamalla  Published on  13 Jan 2024 6:52 AM IST
hyderabad, 19 year old girl, Jain nun,

Hyderabad: జైన సన్యాసినిగా మారబోతున్న 19ఏళ్ల యువతి

యుక్త వయసులో ఉన్నవారు జీవితంలో కొన్ని లక్ష్యాలను పెట్టుకుంటారు. దాన్ని సాధించేందుకు కృషిచేస్తారు. కష్టపడి చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలనుకుంటారు. ఇక చదువు పూర్తయినవారు.. మంచి ఉద్యోగాల కోసమో.. లేదంటే వ్యాపారాల్లో రాణించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదే వయసులో కోరికలు ఎల్లులు దాటి స్వేచ్ఛా విహంగాలై ఎగురుతూ ఉంటాయి. ప్రపంచమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఏదైనా సాధిస్తామనే పట్టుదలతోఉంటారు యువత. కానీ.. ఓ యువతి మాత్రం 19 ఏళ్ల వయసులోనే అందరినీ ఆశ్చర్య పరిచే నిర్ణయం తీసుకుంది.

జైన సన్యాసులు అంటే దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. వారు అన్ని కోరికలను మూటకట్టి అటకమీదకి ఎక్కించి సన్యాసినిగా జీవిస్తుంటారు. సాధారణంగా జీవితంలో అన్ని సుఖాలు.. కష్టాలు.. అనుభూతులు చెందినవారే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ హైదరాబాద్‌లో ఉంటోన్న ఓ 19 ఏళ్ల యువతి ఇప్పుడే జైన సన్యాసం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆ యువతిపేరు యోగిత సురానా. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకి చెందిన యువతి. కేవలం 19 ఏళ్లు నిండిన ఆమె కోరికలు, అనుబంధాలు, బాంధవ్యాలను త్యజించి జైనసన్యాసినిగా మారాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ సోమాజీగూడలోని మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా ఆ యువతే వెల్లడించింది. తల్లిదండ్రులు ఆమెనిర్ణయాన్ని తెలుసుకుని ముందు షాక్‌ అయినా.. తర్వాత అర్థం చేసుకుని ఒప్పుకున్నారు. యువతి తల్లిదండ్రులు పద్మరాజ్ సురానా, స్వప్న సురానా జైన సామాజిక వర్గ పెద్దలతో మాట్లాడారు. ఆ తర్వాత విషయాన్ని వెల్లడించారు. కాగా.. సదురు యువతి 16వ తేదీన సన్యాసినిగా మారబోతున్నట్లు వారు పేర్కొన్నారు.

Next Story