తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్నికేసులంటే..?
6361 New covid 19 cases reported in telangana.తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 77,435 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 6,361 పాజిటివ్ కేసులు నమోదు.
By తోట వంశీ కుమార్ Published on
5 May 2021 4:25 AM GMT

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,435 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 6,361 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. నిన్న ఈ మహమ్మారి కారణంగా 51 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి నేటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,527కి చేరింది. నిన్న 8,126 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,09,481కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 82.91శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.53శాతంగా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,225 నమోదు కాగా.. ఆ తరువాత మేడ్చల్ జిల్లాలో 422, రంగారెడ్డి జిల్లాలో 423 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
Next Story