తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా విల‌య‌తాండ‌వం కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 58,742 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా 5,695 పాజిటివ్ న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. నిన్న ఒక్క రోజే 49 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 24,17కి చేరింది. నిన్న 6,206 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 3,73,933కి చేరింది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో 80,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 81.91 శాతం ఉండ‌గా.. మ‌ర‌ణాల రేటు 0.52 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 1,352 నమోదవగా.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 427, రంగారెడ్డిలో 483, నల్గొండలో 52, సంగారెడ్డిలో 249, వరంగల్‌ అర్బన్‌లో 393, నిజామాబాద్‌లో 258, మహబూబ్‌నగర్‌లో 221, కరీంనగర్‌లో 231, జగిత్యాలలో 190, సిద్దిపేటలో 238, వికారాబాద్‌లో 109 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.
సామ్రాట్

Next Story