తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 75,289 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,801 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో నిన్న ఒక్కరోజే 7,430 మంది కరోనా నుంచి కోలుకోగా.. 32 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 5,06,988 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,44,049 మంది కోలుకున్నారు. ఇంకా 60,136 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,803కి పెరిగింది. కరోనా మరణాల శాతం దేశంలో 1.1 శాతం కాగా, తెలంగాణలో 0.55 శాతంగా నమోదైంది. దేశంలో కరోనా రికవరీ రేటు 82.7 శాతం కాగా, తెలంగాణలో అది 87.58 శాతంగా ఉంది.
ఇదిలావుంటే.. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 756 కొత్త కేసులు నమోదుకాగా.. రంగారెడ్డిలో 325, వరంగల్ అర్బన్‌లో 215, మేడ్చల్ మల్కాజిగిరిలో 327, నల్గొండలో 254, కరీంనగర్‌లో 172, ఖమ్మంలో 196, మహబూబ్ నగర్‌లో 162, వికారాబాద్‌లో 163 చొప్పున అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం పది గంటల నుండి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు కానుంది. 21వ తారీఖు వరకూ లాక్‌డౌన్ కొనసాగనుంది.