తెలంగాణ‌లో కొన‌సాగుతున్న క‌రోనా వ్యాప్తి.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

4693 New Corona cases 33 deaths in telangana.తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 71,221 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 4,693 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 13 May 2021 6:23 PM IST

TS corona update

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 71,221 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 4,693 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,16,404కి చేరింది. నిన్న ఒక్క రోజే 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 2,863కి పెరిగింది.


నిన్న 6,876 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,56,620కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 56,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 734 కేసులు న‌మోదు అయ్యాయి. రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 88.42శాతంగా ఉండ‌గా.. మ‌ర‌ణాల రేటు 0.55శాతంగా ఉంది.


Next Story