ఆర్టీసీలో ఈరోజు సరిగ్గా 40 సంవత్సరాల కిందట ఏసీ బస్సులను ప్రవేశ పెట్టారట..! ఇప్పుడంటే ఎన్నో ఏసీ బస్సులను మనం చూస్తూ వస్తున్నాం. కానీ అప్పట్లో ఏసీ బస్సు అత్యంత అరుదు కదా..! అందుకే ఆ రోజుల్లో ఎంతో గొప్పగా ఏపీఎస్ ఆర్టీసీ అందుకు సంబంధించిన ప్రకటన ఇచ్చింది. విజయవాడ నుండి హైదరాబాద్ కు ఈ ఏసీ బస్సు ప్రయాణం ఉండేది. 01-06-1982న అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విభాగం సగర్వంగా ఏసీ బస్సును ప్రజల కోసం తీసుకుని వచ్చింది. ఈ ఏసీ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడకు నడుస్తుంది. అప్పట్లో టికెట్ ధర 65 రూపాయలు మాత్రమేనట.. కేవలం సూర్యాపేటలో మాత్రమే ఆపుతూ ఉండేవారు. అప్పటి ప్రకటనను తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నెటిజన్లతో పంచుకున్నారు.
'చరిత్రలో ఈ రోజు ఆర్టీసీలో మొట్టమొదటిసారిగా AC బస్సులు ప్రవేశపెట్టిన రోజు 01-Jun-1982
Completed Ruby Jubilee of 40 Years for the Introduction of AC Buses in erstwhile #APSRTC Now #TSRTC" అంటూ సజ్జనార్ అప్పటి ప్రకటనను షేర్ చేశారు.