తెలంగాణ హెల్త్ బులిటెన్ విడుద‌ల‌.. మ‌రో 30 మర‌ణాలు

3961 New Corona Case reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 62,541 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 3,961 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

By Medi Samrat
Published on : 17 May 2021 8:44 PM IST

TS corona update

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 62,541 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 3,961 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,32,784కి చేరింది. నిన్న ఒక్క రోజే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 2,985కి పెరిగింది.

నిన్న 5559 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,80,458కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 49,341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 631 కేసులు న‌మోదు అయ్యాయి. రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 90.17శాతంగా ఉండ‌గా.. మ‌ర‌ణాల రేటు 0.56శాతంగా ఉంది.




Next Story