గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 1,15,311 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,187 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,27,278కి చేరింది.
నిన్న ఒక్క రోజే ఏడుగురు కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,759కి చేరింది. నిన్న ఒక్క రోజే 787 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,05,335కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 13,366 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీలో తాజాగా 551 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 333, రంగారెడ్డిలో 271 కేసులు నమోదయ్యాయి.