తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా కేసులు ఎన్నంటే..?

313 New corona cases reported in Telangana.తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతుతోంది. నిన్న‌టితో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2021 1:44 PM GMT
తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా కేసులు ఎన్నంటే..?

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 71,304 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 313 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,58,689కి చేరింది. నిన్న క‌రోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,878కి పెరిగింది. నిన్న 354 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,49,002కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 5,809 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.52 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

Next Story
Share it