రాజన్న సిరిసిల్లలోని ఎల్లారెడ్డిపేట్ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన వారిని సిరిసిల్ల ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థులకు వాంతులు, వికారం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. విద్యార్థులంతా కోలుకుని శనివారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సోమన్‌మోహన్‌రావు తెలిపారు.
"30 మంది విద్యార్థులలో 10 మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరో 20 మంది భయాందోళనలో ఉన్నారు, కానీ లక్షణాలు కనిపించలేదు. 30 మందిని ఈ ఉదయం డిశ్చార్జ్ చేశారు" అని సిరిసిల్ల డీఎమ్‌హెచ్‌వో తెలిపారు. ఇన్ఫెక్షన్‌కు గల కారణాలను ఇంకా గుర్తించాల్సి ఉందని కూడా ఆయన తెలిపారు. అయితే వంటకు వినియోగించిన నీరు కలుషితం కావడంతోనే విద్యార్థులకు అస్వస్థతకు గురైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నీటి నమూనాలను పరీక్షల కోసం పంపామని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.