Nalagonda: వాటర్ ట్యాంక్‌లో 30 కోతులు మృతి.. అవే నీళ్లు తాగిన స్థానికుల్లో భయాందోళన

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బుధవారం వాటర్ ట్యాంక్‌లో సుమారు 30 కోతులు మృతి చెందాయి.

By అంజి  Published on  4 April 2024 1:02 AM GMT
monkeys, water tank, Nalagonda, Nandikonda Municipality, Hill Colony

Nalagonda: వాటర్ ట్యాంక్‌లో 30 కోతులు మృతి.. అవే నీళ్లు తాగిన స్థానికుల్లో భయాందోళన

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బుధవారం వాటర్ ట్యాంక్‌లో సుమారు 30 కోతులు మృతి చెందాయి. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున సాగర్ సమీపంలోని వాటర్ ట్యాంక్ నుంచి కోతుల మృతదేహాలను మున్సిపల్ కార్మికులు బయటకు తీశారు. హిల్‌కాలనీలోని సుమారు 200 కుటుంబాలకు తాగునీరు అందించేందుకు వాటర్‌ ట్యాంక్‌ను వినియోగిస్తున్నారు. మున్సిపల్‌ సిబ్బంది ఆ వాటర్‌ ట్యాంక్‌లో చెత్తచెదారం పడకుండా.. దాని పైన మెటల్‌ షీట్లు వేశారు.

ఎండ వేడిమి కారణంగా కోతులు నీటి కోసం లోహపు రేకుల ద్వారా ట్యాంకులోకి ప్రవేశించినా బయటకు రాలేక నీటిలో మునిగిపోయి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో కోతుల మృత దేహాలు బయటపడిన తర్వాత అదే నీటిని తాగడం వల్ల వాటి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. 10 రోజుల క్రితం కోతులు తాగేందుకు ప్రయత్నం చేసి మృత్యువాత పడినట్లు అనుమానిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story