Telangana: ముగ్గురు దళిత బంధు లబ్ధిదారులు.. పారిశ్రామికవేత్తలుగా ఎలా మారారంటే?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు సంక్షేమ పథకంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర గ్రామానికి చెందిన సూదామల్ల

By అంజి  Published on  27 March 2023 1:32 AM GMT
Dalit Bandhu , Dalit Bandhu beneficiaries, Rajanna sirisilla

Telangana: ముగ్గురు దళిత బంధు లబ్ధిదారులు.. పారిశ్రామికవేత్తలుగా ఎలా మారారంటే?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు సంక్షేమ పథకంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర గ్రామానికి చెందిన సూదామల్ల రాజేశ్వరి, విజయ్‌కుమార్, డప్పుల లింగయ్య దంపతులు పారిశ్రామికవేత్తలుగా మారారు. దళిత వర్గానికి చెందిన లబ్ధిదారులు రాజేశ్వరి, విజయ్‌కుమార్‌, లింగయ్యలు రైస్‌మిల్లు ఏర్పాటుకు దళిత బంధు ద్వారా వచ్చిన డబ్బులను సమకూర్చారు. దళిత వర్గానికి చెందిన ఈ ముగ్గురూ ఎల్లారెడ్డిపేట మండలం దుమాల శివారులో రూ.30 లక్షలు (దళిత బంధు కింద ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు) వెచ్చించి మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. బ్యాంకు రుణం కూడా తీసుకున్నారు.

రైస్ మిల్లు పేరు 'విజయలక్ష్మి ఇండస్ట్రీస్'. దీనిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించనున్నారు. దళిత బంధు పథకం ద్వారా విజయం సాధించిన ముగ్గురికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. T-PRIDE (తెలంగాణ - దళిత పారిశ్రామికవేత్తల వేగవంతమైన ఇంక్యుబేషన్ కార్యక్రమం) దళిత సమాజంలో విజయవంతమైందని కూడా ఆయన పేర్కొన్నారు. ''రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర గ్రామం నుండి దళితబంధు పథకం హృదయపూర్వక విజయగాథ. ముగ్గురు లబ్ధిదారులు రాజేశ్వరి, విజయ్ కుమార్, లింగయ్య కలిసి తమ దగ్గరున్న దళితబంధు డబ్బులు రూ.30 లక్షలతో పాటు బ్యాంకు రుణాన్ని సేకరించి రైస్‌ మిల్లును నిర్మించారు. ప్రభుత్వ పారిశ్రామిక రాయితీలను పొందారు, రేపు ప్రారంభోత్సవం T-PRIDE (తెలంగాణ - దళిత పారిశ్రామికవేత్తల వేగవంతమైన ఇంక్యుబేషన్ కార్యక్రమం) దాని పేరుకు తగినట్లుగా ఉంది. విజనరీ సీఎం #కేసీఆర్‌గారికి ధన్యవాదాలు'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

గ్రామీణ ఉపాధి, వ్యాపారాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం T-IDEAతో పాటు T-PRIDEని గత సంవత్సరం ప్రారంభించింది. T-PRIDE విద్యుత్ ఖర్చు రీయింబర్స్‌మెంట్, భూమి ధర, రిజర్వేషన్‌లు, ఇతర రాయితీలు వంటి సౌకర్యాలను అందించడం ద్వారా యువ షెడ్యూల్స్ కులాలు/షెడ్యూల్డ్ తెగలు, శారీరకంగా వికలాంగుల జీవితాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సంక్షేమ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు వ్యాపార, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్‌ ప్రారంభోత్సవ సందర్భంగా తెలిపారు.

Next Story