తెలంగాణలో 29 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
29 IPS officers in Telangana police transferred.అంజనీకుమార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించిన
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2023 4:17 AM GMTఅంజనీకుమార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించిన మూడు రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం 29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. యాంటి నార్కోటిక్ బ్యూరో ఏడీజీగా సీవీ ఆనంద్, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా రాజీవ్ రతన్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్ర లను నియమిస్తూ ఉత్వర్తులు జారీ చేసింది.
ఎవరెవరు ఎక్కడెక్కడంటే..
- హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజీవ్ రతన్
- పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య
- హైదరాబాద్ అదనపు (లా అండ్ ఆర్డర్)గా విక్రమ్ సింగ్ మాన్
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్రకు అదనపు బాధ్యతలు
- హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా సుధీర్‌బాబు
- ఆర్గనైజేషన్, లీగల్ అదనపు డీజీగా శ్రీనివాస్‌రెడ్డి
- రైల్వే అదనపు డీజీగా శివధర్‌రెడ్డి
- పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా అభిలాష బిస్తు
- మహిళా భద్రత, షీటీమ్స్ అదనపు డీజీగా షికా గోయల్
- పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ అదనపు డీజీగా శ్రీనివాసరావుకు బాధ్యతలు
- టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ అదనపు డీజీగా స్వాతి లక్రా
- గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డీజీగా విజయ్ కుమార్
- అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నాగిరెడ్డి
- మల్టీజోన్-2 ఐజీగా షానవాజ్ ఖాసిం
- పోలీసు శిక్షణ ఐజీగా తరుణ్ జోషి
- ఐజీ (పర్సనల్)గా కమలాసన్ రెడ్డి
- మల్టీజోన్ -1ఐజీగా చంద్రశేఖర్‌రెడ్డి
- డీఐజీ (పీ అండ్ ఎల్)గా రమేష్
- ఇంటెలిజెన్స్ డీఐజీగా కార్తికేయ
- రాజన్న జోన్ డీఐజీగా రమేష్ నాయుడు
- సీఏఆర్ సంయుక్త సీపీగా ఎం. శ్రీనివాసులు
- ఐఎస్‌డబ్ల్యూ డీఐజీగా తఫ్సీర్ ఇక్బాల్
- రాచకొండ సంయుక్త సీపీగా గజరావు భూపాల్
- యాదాద్రి జోన్ డీఐజీగా రెమా రాజేశ్వరి
- నల్గొండ ఎస్పీగా రెమా రాజేశ్వరికి అదనపు బాధ్యతలు
- జోగులాంబ జోన్ డీఐసీగా ఎల్.ఎస్ చౌహాన్
- సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీగా నారాయణ నాయక్
- హైదరాబాద్ సంయుక్త సీపీగా పరిమళ
- కౌంటర్ ఇటెలిజెన్స్ సెల్ ఎస్పీగా ఆర్. భాస్కరన్