TSRTC: రోజుకు 27 లక్షల మంది మహిళల ప్రయాణం.. రూ.10 కోట్ల విలువైన జీరో టిక్కెట్లు జారీ

మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రంలో 6.50 కోట్ల మంది మహిళలు రన్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని టీఎస్‌ఆర్‌టీసీ వెల్లడించింది.

By అంజి  Published on  4 Jan 2024 1:47 AM GMT
women travel, TSRTC, Zero tickets , Free Bus

TSRTC: రోజుకు 27 లక్షల మంది మహిళల ప్రయాణం.. రూ.10 కోట్ల విలువైన జీరో టిక్కెట్లు జారీ

హైదరాబాద్: మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రంలో 6.50 కోట్ల మంది మహిళలు రన్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) వెల్లడించింది. రోజుకు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుండగా రోజుకు రూ.10 కోట్ల విలువైన జీరో టిక్కెట్లు జారీ అవుతున్నాయని అధికారులు తెలిపారు. రోజుకు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుండగా రోజుకు రూ.10 కోట్ల విలువైన జీరో టిక్కెట్లు జారీ అవుతున్నాయని అధికారులు తెలిపారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన అధికారులను అభినందించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు సంస్థ ఉన్నతాధికారులు వివరించారు.

ఆర్థిక శాఖ నుండి పూర్తి సహకారం అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. రోజు వారీ నిర్వహణకు అవసమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బంది, అధికారులను అభినందించారు. ఈ స్కీం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని, ఈ స్కీమ్ ను ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రజల సంస్థ అని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సంస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని, టికెట్ ఆదాయంపైనే కాకుండా.. లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర టికేటేతర ఆదాయంపైనా సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు. సిబ్బంది బకాయిలు, కంపెనీ అప్పులు, ప్రావిడెంట్ ఫండ్‌లు (పిఎఫ్‌లు), ఇతర సెటిల్‌మెంట్లకు సంబంధించి టిఎస్‌ఆర్‌టిసికి నిధులను అందించడానికి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక శాఖకు అధిపతి అయిన ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు.

Next Story